విద్యార్థులకు రేబిస్ వ్యాధి పై అవగాహన సదస్సు

Sep 28, 2024 - 14:51
Sep 28, 2024 - 17:01
 0  48
విద్యార్థులకు రేబిస్ వ్యాధి పై అవగాహన సదస్సు

రేబిస్ రహిత ప్రపంచమే లక్ష్యం గా ప్రపంచ రేబిస్ దినోత్సవం వేడుకలు

విద్యార్థులకు రేబిస్ వ్యాధిపై అవగాహన సదస్సు

కోదాడ ప్రాంతీయపశువైద్యశాల లో కుక్కలకి ఉచిత రేబిస్ టీకాలు

కోదాడలో వీది కుక్కల నివారణకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో త్వరలో కుక్కల పునరావాస కేంద్రం ఏర్పాటు

కోదాడ పట్టణం క్రాంతి ది ఫౌండేషన్ పాఠశాలలో ప్రపంచ రేబిస్ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్ధులకి అవగాహన సదస్సు నిర్వహించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి. పెంటయ్య 

క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే రేబిస్ వ్యాధి గుర్తించినా 1885 లో తొలిసారిగా ఈ వ్యాధికి టీకాలు కనుక్కోవడం జరిగిందని కాలక్రమేణా మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తొలుత నాభి చుట్టూ 14 ఇంజక్షన్లు వేసే స్థితి నుండి నేడు నెలరోజుల కాల వ్యవధిలో 5 టీకాలు సాధారణ ఇంజక్షన్ల వలె తీసుకుంటే కుక్క కరిచినా రేబిస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అన్నారు

 ఒకే దేశం ఒక ఆరోగ్యం నినాదంతో సాంక్రమిక వ్యాధుల నివారణకు గాను ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుంది

అందులో భాగంగా వీది కుక్కల నివారణకు నగరాలు మున్సిపాలిటీల్లో కుక్కలపునరావాసకేంద్రాలు ఏర్పాటు చేసి కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ద్వారా సంతతిని నిరోధిస్తూ ఉన్న వాటికి టీకాలు వేయించి పట్టణంలో కుక్కలబెడదలేకుండా మున్సిపాలిటీ ప్రణాళిక చేస్తుంది అన్నారు

      పెంపుడు కుక్కలు పిల్లులకి ఖచ్చితంగా మూడు మాసాల వయస్సురాగానే రేబిస్ నివారణ టీకాలు వేయించడం ద్వారా జంతువులు యజమానులు ఆరోగ్యంగా ఉండాలని సూచించారు

విద్యార్థుల్లో పోరాట శక్తి పెద్దల్ని ఒప్పించే ప్రతిభ మెండుగా ఉంటుందని రేబిస్ నివారణపై ఇచ్చే సూచనలు తమ కుటుంబ సభ్యులు బంధువులు వాడలోని వారితో చర్చించి ఆచరింపచేయించడం ద్వారా రేబిస్ నియంత్రనలో భాగస్వాములవ్వాలని సూచించారు

    కుక్కలనుండి రక్షణకు 

1. కుక్కలకి పిల్లలు దూరంగా నడచి వెళ్ళాలి

2. ⁠కుక్క పైకి వస్తే కదలకుండా నిల్చోవాలి. కుక్క దగ్గరగా వచ్చి వాసన చూసి వెళ్తుంది

3. ⁠కుక్క పైకి వస్తుంటే నేలపై బోర్లా కొని కదలకుండా ఉండాలి

4. ⁠తలకి ముఖానికి గాట్లు పడకుండా చేతులను తలపై పెట్టి ముఖాన్ని కడుపులో పెట్టుకోవాలి

5. ⁠పొరపాటున కుక్కకరిస్తే 15 నిమిషాల లోపులో నురగవచ్చే సబ్బు పెట్టి నీటి ధారతో గాయాల్ని కడగాలి. వెంటనే వైద్యుల్ని సంప్రదించి గాయానికి చికిత్సతో టీకాలు వేయించుకోవాలి

6. ⁠ కుక్క కరచిన వారం నుండి 6 మాసాల్లో లక్షణాలు ఎప్పుడైనా రావచ్చు

7. ⁠టీకాలు వేయించుకున్నవారికి ఎలాంటి ప్రమాదం ఉండదు

అని తేయజేశారు

   కౌన్సిలర్ పెండెం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీలో వీది కుక్కల శాశ్వత నివారణకు ఎకరం బూమి కేటాయించి కుక్కల పునరావాసకేంద్రం ఏర్పాటుకి పనులు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు 

      క్రాంతి ఫౌండేషన్ స్కూల్ ఫౌండర్ చైర్మన్ మరియు ప్రిన్సిపాల్ రాపోలు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రజలు వివిధకారణాలతో వ్యాపకంగా పెంపుడు జంతువులను సాకుతున్నారని, వాటితో ఆహ్లాదంతో పాటు రోగాలు పొంచి ఉన్నందున అట్టి రోగాలు. నివారణకు అవగాహన ఎంతో అవసరం అని ఆరోగ్య సమాజానికి ఎప్పటికప్పుడు పిల్లల అవగాహన అత్యంతముఖ్యమని ఇలాంటి మంచి కార్యక్తమాన్ని తమ పాఠశాలలో నిర్వహించినందులకు సంతోషం వెలిబుచ్చి మున్సిపాలిటీ లో వీది కుక్కల నివారణకు ప్రయత్సితున్న మున్సిపాలిటీ కౌన్సిలర్స్ ని ఘనంగా సన్మానించారు

అనంతరం ప్రాంతీయపశువైద్యశాలలో నిర్వహించిన ఉచిత రేబిస్ నివారణ టీకా కార్యక్రమములో రేబిస్ టీకాలు వేశారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State