గతుకుల రోడ్లకు అతుకుల బేరం

Sep 6, 2024 - 20:02
 0  8
గతుకుల రోడ్లకు అతుకుల బేరం
గతుకుల రోడ్లకు అతుకుల బేరం

జోగులాంబ గద్వాల 6 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.గద్వాల :-జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తాయి.పట్టణ రోడ్లే కానీ మున్సిపాలిటీకి సంబంధం లేదు.ఆర్ అండ్ బి సంబంధించిన రోడ్లు ఒక్కో గుంత ఒక్కో ఫీట్ లోపలికి ఉండటంతో వర్షపు నీరు అందులో వచ్చి చేరుతుంది. వర్షం నీటితో నిండిపోయిన రోడ్లు ఎక్కడ సాఫ్ గా ఉన్నాయో, ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో తెలియక రోడ్డు ప్రమాదాలకు పట్టణ ప్రజలు గురవుతున్నారు.నిత్యం ప్రజలు తిరిగే సెకండ్ రైల్వే గేటు సమీపంలోని పంచాయతీ రాజ్ కార్యాలయం ముందు,అంబేడ్కర్ చౌక్ నందు,కృష్ణవేణి చౌక్ నందు,శివాని సూపర్ మార్కెట్ ఎదురుగా...ఇలా ఎక్కడ చూసినా ప్రధాన రోడ్లపై గుంతలే.ప్యాచ్ పనులంటే ఎక్కడైనా డాంబర్ తెచ్చి రోడ్డుపై వేసి గుంతలు పూడ్చడం చూశాం కానీ గద్వాలలో వెరైటీగా పడిపోయిన పాత ఇంటి గోడ ఇటుకలు,మట్టి తెచ్చి పూడుస్తున్నారు.ఆ శాఖలో ప్యాచ్ పనులు చేయడానికి డబ్బులు(బడ్జెట్) లేవా? లేక పనులు చేసే వాళ్ళు(కాంట్రాక్టర్లు) ముందుకు రాకనో? తెలియట్లేదు కానీ అధికారులు మాత్రం ఏదో ఒక మట్టో,ఇటుకనో తెచ్చి పూడ్చి *చెనిగలు తిని చేతులు దులుపుకుంటున్నారు గుడ్డి కన్న-మెల్ల మేలు అన్నట్టుగా పట్టణ ప్రజలు కూడ ముక్కున వేలేసుకుని ఏమి చేయలేక,ఎవరినీ అడగలేక గతుకుల రోడ్లకు-అతుకుల బేరం అనుకుని చూసి చూడనట్టు వెళ్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333