ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు:ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు

Sep 6, 2024 - 19:59
 0  9
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు:ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు

జోగులంబ గద్వాల 6 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల:-జిల్లా ప్రజలకు ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.శుక్రవారం తన ట్రాఫిక్ కార్యాలయం నుండి ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు మాట్లాడుతూ...సకల శాస్త్రాలకు అధిపతిగా,బుద్ధికి,జ్ఞానానికి ఆరాధ్యుడిగా ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా భక్తిశ్రద్దలతో హిందువులు ఆరాధ్యదైవంగా ఆరాధిస్తారని అన్నారు.శాంతియుతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను జిల్లా ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని అయన ఆకాంక్షించారు.గణనాథుని ఆశీస్సులు కలకాలం అందరిపై ఉండాలని అందరికీ మంచి ప్రసాదించాలని కోరారు.తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.నిమజ్జనంకు బయలుదేరే సమయంలో విద్యుత్ తీగల పట్ల జాగ్రత్త వహిస్తూ శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో భక్తిగీతాలు ఆలపిస్తూ నిమజ్జనంకు బయలుదేరాలని కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333