ఆశవర్కర్లకు వేతనం పెంచాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన ఆశవర్కర్లు
అడ్డగూడూరు 18 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వివిధ గ్రామాల ఆశా వర్కర్లు తమ వేతనం పెంచాలని ఎమ్మెల్యే మందుల సామేల్ కు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన ప్రభుత్వం పేదల బీదల ప్రభుత్వం పెద్ద సారు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో అమృత మగదిల్లిన,సుజాత,కవిత, స్వరూప,శైలజ, మంజుల తదితరులు పాల్గొన్నారు.