మేడికొండ పులికల్లు , ఐజా గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

Sep 6, 2024 - 20:09
Sep 6, 2024 - 20:28
 0  17

జోగులాంబ గద్వాల 6 సెప్టెంబర్ 284 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజమండలం పోలోను వాగు వద్ద నిర్మించిన తాత్కాలిక రోడ్డు మార్గం గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కొట్టుకుపోవడం వలన ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో సమస్యను తెలుసుకున్న అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డా. SA .సంపత్ కుమార్ వంతెన నిర్మాణ పనులను పరిశీలించి ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే తాత్కాలిక రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు.
అంతేకాకుండా నిర్మిస్తున్నటువంటి  నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎలాంటి అవంతరాలు లేకుండా చూడాలని ఆయన అధికారులకు  సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి దొడ్డప్ప , వైస్ చైర్మన్ కొమ్ము కుమార్, మేడికొండ లక్ష్మీకాంతరావు, మహిళా నాయకురాలు సులోచనమ్మ, కిసాన్ సెల్ అధ్యక్షులు కొంకల నాగరాజు, మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333