సూర్యాపేట జిల్లాలో 82,593 మందికి రైతు కుటుంబాలకు రుణమాఫీ...
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్...
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ పథకం అమలు జిల్లాలో రెండు విడతలు కలిపి 82,593 రైతు కుటుంబాలకు రైతు రుణమాఫీ నిధులు మంజూరయ్యాయని, మొదటి విడతగా లక్ష రూపాయల లోపు 56,217 మంది రైతు కుటుంబాలకు 282.78 కోట్ల రూపాయలు మంజూరిగాక, సెకండ్ ఫేసులో లక్ష నుండి 1,50,000 వరకు రుణం తీసుకున్న 26,376 మంది రైతు కుటుంబాలకు 250 కోట్లు 30వ తారీఖున రైతులకు వారి ఖాతాలో జమ కానున్నాయని రెండు దఫాలుగా జిల్లాలో రైతులకు రుణమాఫీ కింద 532.78 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రెండో విడత రుణమాఫీ పథకం అమలు రేపు ఉదయం 11 గంటలకు సూర్యాపేట లోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశం మందిరంలో జరుగుతుంది కావున రైతులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులందరూ సకాలంలో హాజరు కావాల్సిందిగా కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు.