గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న ఎస్ఐ డి నాగరాజు

Dec 26, 2024 - 21:55
Dec 26, 2024 - 21:57
 0  117
గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న ఎస్ఐ డి నాగరాజు

అడ్డగూడూరు 26 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన బీరవెల్లి నర్సయ్య తండ్రి శ్రీశైలం అనే వ్యక్తి నా కూతురు పెళ్లికి తెచ్చిన అప్పుల బాధకు తట్టుకోలేక తేదీ 22 డిసెంబర్ 2024 రోజున ఉదయం సుమారు 03 గంటల సమయంలో తన ఇంట్లో ఉన్న గడ్డి మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా! ఈ విషయాన్ని గమనించిన తన భార్య సత్యవతి వెంటనే 108 అంబులెన్స్ లో సూర్యపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినారు. అక్కడ చికిత్స పొందుతూ.. బుధవారం రోజు ఉదయం బిరవెల్లి నర్సయ్య చనిపోవడం జరిగింది. ఇట్టి విషయం గురించి తన భార్య సత్యవతి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా !  అడ్డగూడూరు ఎస్ఐ డి నాగరాజు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.