ఖమ్మం వరద బాధితులకు సూర్యాపేట బాప్టిస్ట్ స్త్రీల సమాజం ఆధ్వర్యంలో  

నిత్యవసర వంట సరుకులు సరఫరా

Sep 6, 2024 - 18:42
Sep 6, 2024 - 18:56
 0  5
ఖమ్మం వరద బాధితులకు సూర్యాపేట బాప్టిస్ట్ స్త్రీల సమాజం ఆధ్వర్యంలో  

సూర్యాపేట: సెప్టెంబర్ 6..తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కాకవికలమైన ఖమ్మం నగరంలో ని వరద బాధితులకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ స్త్రీల సమాజం అధ్యక్షురాలు పెదపంగు కవిత ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు వారం రోజులకు సరిపోను నిత్యవసర వంట సామాగ్రిని అందజేసేందుకు చర్చి నుండి ఖమ్మం నగరానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సెంటినరీ బాప్టిస్ట్ చర్చి స్త్రీల సమాజం అధ్యక్షురాలు పెదపంగు కవిత*సంఘాకాపరి ప్రభుదాస్ లు మాట్లాడుతూ సమాజ సేవలో స్త్రీల సమాజం ముందు వరుసలో ఉంటుందన్నారు. వరద ప్రభావంతో సర్వం కోల్పోయిన ప్రజలకు తమ వంతు సహాయంగా 100 కుటుంబాలకు వారం రోజులకు సరిపోను వంట సామాగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో వరద బాధితులకు తమ వంతు సహాయాన్ని అందించాలని ఆమె కోరారు.

వంట సామాగ్రితో తరలి వెళ్తున్న వాహనాన్ని  సెంటినరీ బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి యం.ప్రభుదాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చి అధ్యక్షుడు జాన్ సుమిత్ర, కోశాధికారి పి.హూబర్ట్. మర్రి పోలేనెస్.వల్దాస్ ఉపేందర్ శ్రీనివాస్ సెంటినరీ బాప్టిస్ట్ స్త్రీల సమాజం ఉపాధ్యక్షురాలు బొజ్జ విజయ సైమన్, కార్యదర్శి సువార్త రత్నం, సహాయ కార్యదర్శి వల్దాస్ అరుణ, కోశాధికారి తులసి జఫన్య, ఆదరణ ప్రాజెక్టు లీడర్ జి శాంత, బైబిల్ ఉమెన్స్ జలగం ఎలిజిబెత్, కొండ రాణి, గోగుల కలమ్మ, దైద రమణ, చర్చి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333