రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం & ఖమ్మం సెంట్రల్ వారి ఆధ్వర్యంలో
వరద బాధితుల సహాయార్ధం నిత్యావసర సరుకుల పంపిణీ .
ఖమ్మం నగరం చుట్టుపక్కల వరద ప్రభావిత ప్రాంతాలైన రామన్నపేట , ధంసలాపురం మున్నగు ప్రాంతాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఖమం , రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం - సెంట్రల్ మరియు ఇన్నర్ వీల్ సభ్యులు సంయుక్తంగా 2500 మందికి నిత్యావసర వస్తువుల కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు . ఒక్కో కిట్లో 5 కిలోల బియ్యం , 2 కిలోల రవ్వ , వంట నూనె , చక్కెర , ఉప్పు , పప్పు , ఉల్లిపాయలు , బంగాళదుంపలు , సబ్బులు మొదలైన నిత్యావసర సరుకులు రూ.1,000/- రూపాయల విలువకలిగి ఉన్నాయి . నిత్యావసర వస్తువుల పాక్కెట్స్ వరద బాధితులకు పంపిణీ చేయడంలో రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 లోని వివిధ రోటరీ క్లబ్ల ఆర్థిక సహాయ సహకారములతో మరియు స్థానిక స్వచ్చంద సంస్థల కార్యకర్తల సేవలను ఉపయోగించుకున్నారు . ఈ కార్యక్రమంలో రోటరీ జిల్లా గవర్నర్ ఆర్టిఎన్ (Rtn) కె. శరత్ చౌదరి , డిస్ట్రిక్ గవర్నర్ ఎలెక్ట్ ఆర్టిఎన్ (Rtn) డా. రాంప్రసాద్ , పొస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్లాది వాసుదేవ్ , స్థానిక క్లబ్ల అధ్యక్షులు ఎన్.రవీంద్రనాథ్ , జి.రాంబాబు , క్లబ్ కార్యదర్శులు హరి శ్రీనివాస్ , ఎస్.ప్రవీణ్ , సీనియర్ రోటేరియన్లు డిప్యూటీ గవర్నర్ దొడ్డపనేని సాంబశివరావు , అసిస్టెంట్ గవర్నర్ పలివెల భూషణ్ రావు , కె. కొండల్ రావు , పసుమర్తి రంగారావు , కాళ్ల పాపారావు , ఐ.రామకృష్ణ , కోటేరు వెంకటరెడ్డి , బొడ్డు సుధాకర్ మొదలైన రోటరీ ఇన్నర్ వీల్ అధ్యక్షులు స్వర్ణలత , పీడీసీ శరీదేవి , సభ్యులు విజేత , కమల , ప్రమీల , జానాబాయి , కవిత తదితరులు స్థానిక అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు .