గ్రామ పంచాయతీల ముసాయిదా పోలింగ్ పోస్టర్ జాబితా ఏర్పాటు
ఎంపీడీవో పి శంకరయ్య
అడ్డగూడూరు 11 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన విధంగా ఎంపీటీసీ జెడ్పిటిసి సాధారణ ఎన్నికలు కొరకు అడ్డగూడూరు మండలంలోని 07 ఎంపీటీసీలు,17 గ్రామ పంచాయతీల యొక్క ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాలను గ్రామపంచాయతీ కార్యాలయం మరియు ఎంపీడీవో కార్యాలయము నోటీస్ బోర్డు లపై ప్రచురించడమైనదని ఎంపీడీవో పి.శంకరయ్య తెలియజేశారు.ఇట్టి ముసాయిదా గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ల జాబితా విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉన్న ఎడల రాష్ట్ర ఎన్నికల సంఘం వారి నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా తేదీ 11 మంగళవారం నుండి తేదీ13 గురువారం వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించవచ్చని తెలిపారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల మండల స్థాయి ప్రతినిధులతో 13 గురువారం రోజున ఇట్టి ఎంపీటీసీ 07 గ్రామ పంచాయతీలు 17గ్రామ పంచాయతీల ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితా విషయమై సమావేశం నిర్వహించబడుతుందని తెలియజేశారు.