క్రీడా రంగానికి పెద్ద పీఠ వేసిన నాయకుడు సీఎం.

సీఎం కప్  - 2024 టార్చ్ ర్యాలీ ఎమ్మెల్యే.

Oct 19, 2024 - 16:22
 0  6
క్రీడా రంగానికి పెద్ద పీఠ వేసిన నాయకుడు సీఎం.

జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలో ఈనెల 8 తేదీ నుండి ప్రారంభమైన సీఎం టార్చ్ ర్యాలీ నేడు గద్వాలకు చేరుకున్న సందర్భంలో సంగాల పార్క్ నుండి క్రీడాకారులు తో కలిసి  జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీ ను  గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ , జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు, జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ .  జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. సీఎం కప్ టార్చ్ ర్యాలీ ని ప్రారంభించ ఎమ్మెల్యే  జిల్లా కలెక్టర్ . 
  సీఎం కప్ పోటీలను గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు త్వరలో నిర్వహించడం జరుగుతుంది. ఈనెల 21 తేదీ నాడు గ్రామీణ స్థాయి పోటీలను ప్రారంభిస్తారు. 26 వ తేదీన జిల్లాస్థాయి నవంబర్ 8వ తేదీన రాష్ట్రస్థాయి క్రీడ లను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు .
 ఎమ్మెల్యే  మాట్లాడుతూ 
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్రీడా రంగానికి పెద్దపీట వేయడం జరిగింది. ఈనెల 21 తేదీ క్రీడా పోటీలను ప్రారంభించడం జరుగుతుంది. సీఎం కప్ టార్చ్ ర్యాలీ నేడు గద్వాలకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
గ్రామీణ స్థాయిలో క్రీడా కారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్   ఉద్దేశం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థినీ విద్యార్థులు, యువత యువతులు, విద్యతో పాటు క్రీడా రంగాల్లో కూడా నైపుణ్యత కలిగి ఉండాలి. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ లో గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామ, మండల, జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయిలో  జరగబోయే పోటీలలో గద్వాల చెందిన క్రీడలు క్రీడాకారులు సెలెక్ట్, అలాగే రాష్ట్రం నుండి ఒలంపిక్ లో జరగబోయే క్రీడల్లో కూడా గద్వాల ప్రాంతానికి చెందిన క్రీడాకారులు ఎంపిక కావాలని  అని ఆకాంక్షించారు.
గ్రామీణ ప్రాంతాలలో గతంలో కీడారంగం లో ఎంతో నైపుణ్యం ప్రదర్శించేవారు. కబడ్డీ క్రీడలను గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా క్రీడాకారులు ఉండేవారు. ప్రతి ఒక యువత చదువుతోపాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యత కలిగి ఉండాలి. క్రీడల వల్ల మనకు శారీరకంగా మానసికంగా దృఢత్వం లభిస్తుంది.
ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం  నేతృత్వంలో క్రీడాకారులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క యువత  క్రీడలను ఆడడానికి అందుబాటులో తీసుకురావడం జరిగినది. 
సీఎం కప్ రాష్ట్రస్థాయిలో గద్వాల నియోజకవర్గనికి  చెందిన క్రీడాకారులు మొదటి స్థానంలో విజేతలుగా నిలిచి గద్వాల నియోజకవర్గం పేరు ప్రతిష్టలను పెంచాలని ప్రతి ఒక్క క్రీడాకారి కోరారు.   
 జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ..... 
 గ్రామీణ ప్రాంతాల్లో స్థాయి నుంచి యువకులు,  యువత  క్రీడల్లో కూడా ఎక్కువనే   నైపుణ్యత పొంది ఉండాలి గ్రామ, నుండి రాష్ట్రస్థాయిలో ఎంపికై గద్వాల కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.
ప్రతి ఒక్క విద్యార్థి చదువుతోపాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యత పొంది ఉండాలి క్రీడల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు కలిగే జరుగుతుందని తెలిపారు.
 త్వరలో జరగబోయే సీఎం కప్  కార్యక్రమం గ్రామ మండల జిల్లా స్థాయిలో నుండి క్రీడాకారులు ఎంపిక చేస్తా మంచి నైపుణ్యత పొంది న క్రీడాకారులను రాష్ట్రస్థాయిలో అంత రాష్ట్రస్థాయిలో ఒలంపిక్ లో వెళ్లే విధంగా ప్రోత్సహిస్తా ను ప్రతి ఒక్క క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
 జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ.... 
సీఎం కప్ టార్చ్ ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా నుండి నేడు గద్వాలకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. 
 క్రీడలు అంటే పోలీసు పోలీసులు అంటే క్రీడా అని పేర్కొన్నారు.
 ప్రతి ఒక్క యువత యువతీ చదువుతోపాటు క్రీడారంగంలో కూడా సామర్థ్యం పొంది ఉండాలి క్రీడల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మంచిగా చదువుకొని క్రీడలలో కూడా మంచిగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ దౌలు , రామకృష్ణ శెట్టి, పూడూరు కృష్ణ, శ్రీను, సుధాకర్, నరహరి గౌడ్, సుదర్శన్ , వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు గోవిందు, వంట భాస్కర్, లక్ష్మన్న, నర్సింహులు , ధర్మ నాయుడు, మధు ,రమేష్ రెడ్డి,  వీరేష్, నాగేంద్ర యాదవ్, బాలాజీ, మొయినుద్దీన్, జిల్లా క్రీడా అధికారి బి.యస్ ఆనంద్, ఎస్ జి టి సెక్రెటరీ జితేందర్, హైదరాబాద్ క్రీడాధికారిలు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333