ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్దినేగం చేసుకోవాలి"అదనపు కలెక్టర్ బి ఎస్ లత

తెలంగాణ వార్త ప్రతినిధి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. దళారులను నమ్మి మోసపోవద్దు. అదనపు కలెక్టర్ బి ఎస్ లత.
తెలంగాణ వార్త: ప్రజా దీవెన, కోదాడ:ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం (Farmers grain) విక్రయించి మద్దతు ధరతోపాటు 500 రూపాయల బోనస్ ను పొందాలని అదనపు కలెక్టర్ బిఎస్ లతా (BS Lata) అన్నారు. శుక్రవారం బాలాజీ నగర్, గుడిబండ గ్రామల్లో ఆర్డీవో సూర్యనారాయణ, పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి లతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రలను అమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం సూచించిన నాణ్యత ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రం లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర (Support price)పొందాలన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వాజిద్, మండల వ్యవసాయ అధికారి రజని,పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ బుడిగం నరేష్, డైరెక్టర్లుగుండపునేని ప్రభాకర్ రావు, కమతం వెంకటయ్య,సోమ పంగు పార్వతి,శిరం శెట్టి వెంకటేశ్వర్లు, గోబ్రా,సీఈఓ మంద వెంకటేశ్వర్లు , స్వామి నాయక్, వాల్యా, ఈర్ల నరసింహారెడ్డి,నవరత్నం రెడ్డి,హసన్ హలీ, వాచేపల్లి వెంకటేశ్వర రెడ్డి,రామకృష్ణారెడ్డి, రవి నాయక్, రాజు నాయక్, శ్రీనివాస్ రెడ్డి, మాధవరెడ్డి సొసైటీ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు