మానవ అక్రమ రవాణా అరికట్టాలని నిశ్శబ్ద నడక ర్యాలీ
జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మానవపాడు:-మానవ అక్రమ రవాణా నిర్మూలన మనందరి బాధ్యత అని రాజ్ కుమార్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిశ్శబ్ద నడక ర్యాలీ నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు రత్నకుమారి ఆధ్వర్యంలో మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో జడ్పీ హైస్కూల్ సిబ్బంది, సిపిఎస్ స్కూల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, యువతీ, యువకులు, విద్యార్థులు, కలిసి మానవ అక్రమ రవాణా నిరోధించాలని, ఆడపిల్లలపై అత్యాచారాలు అమానుశాలు అరికట్టాలని కోరుతూ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా లేని సమాజాన్ని స్థాపించాలన్నారు. బానిసత్వాన్ని అంతం చేసినప్పుడే ప్రజలందరూ స్వేచ్ఛగా జీవిస్తారని తెలిపారు. ఆడపిల్లలను బ్రతకనిద్దాం మంచి సమాజం కొరకు పాటుపడదాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆనందం, వాలంటరీలు రాంప్రసాద్ రెడ్డి, బుచ్చన్న, విజయ్ కుమార్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.