హౌస్ అరెస్టులు రేవంత్ సర్కార్ పిరికిపంద చర్య

Sep 7, 2026 - 19:09
 0  5
హౌస్ అరెస్టులు రేవంత్ సర్కార్ పిరికిపంద చర్య

హౌస్ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..
అడ్డగూడూరు 7 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- బీజేపీ తుంగతుర్తి అసెంబ్లీ కోకన్వీనర్ కూరాకుల వెంకటేశ్వరరావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారాపరాజు రామచందర్ రావు పిలుపు మేరకు మంగళవారం రోజు విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్ 15 వేల కోట్ల రూపాయల విడుదల కొరకు చలో అసెంబ్లీ కార్యక్రమంకు వెళ్లకుండా హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గం ఐన చర్య. హౌస్ అరెస్ట్ లతో భారతీయ జనతా పార్టీ నాయకులను,కార్యకర్తలను అడ్డుకుని ఫీజులు బకాయి - బీజేపీ లడాయి కార్యక్రమం చేపట్టకుండా కుట్ర పూరితంగా పోలీసులతో అడ్డుకోవడం హేయమైన చర్య.ఎంతోమంది విద్యార్దులు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన వారి సంబంధిత కళాశాలలో సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం వలన విద్యార్థులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరి వలన ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు కూడా విద్యార్థుల పక్షపాతిగా ఉంటూ ఈరోజు అరెస్టులు చేసినప్పటికీ ఎటువంటి లేకుండా కచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కొరకు విద్యార్థులు తరఫున పోరాటం చేస్తాము అని తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333