వినాయక ఉత్సవాల అనుమతి తప్పనిసరి ఎస్సై వెంకట్ రెడ్డి

Sep 6, 2026 - 22:01
 0  3
వినాయక  ఉత్సవాల అనుమతి తప్పనిసరి ఎస్సై వెంకట్ రెడ్డి

తిరుమలగిరి 07 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా, వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖ సూచనలు మరియు నిబంధనలను తప్పనిసరిగా  పాటించాలని తిరుమలగిరి ఎస్సై  వెంకటరెడ్డి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గణేష్ మండపాలు ఏర్పాటు చేయదలచిన నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారా గణేష్ మండపం/వినాయక విగ్రహం ఏర్పాటు మరియు ఊరేగింపుకు సంబంధించిన దరఖాస్తు చేసుకొని, అవసరమైన అన్ని అనుమతులను ముందుగానే పొందాలి. అనుమతులు పొందిన అనంతరం మాత్రమే మండపాలను ఏర్పాటు చేసుకోవాలి.  మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల వివరాలు, విద్యుత్ సదుపాయం, ఊరేగింపు మార్గం తదితర వివరాలను దరఖాస్తులో సక్రమంగా నమోదు చేసి, సంబంధిత శాఖల నుండి అవసరమైన అనుమతులు పొందాలి.  ముఖ్యంగా గణేష్ మండపాల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ DJ నిర్వహించరాదు. అధిక శబ్దంతో సంగీతం నిర్వహించి ప్రజలకు, విద్యార్థులకు, వృద్ధులకు మరియు అనారోగ్యంతో ఉన్న వారికి ఇబ్బంది కలిగించరాదు. లౌడ్‌స్పీకర్ల వినియోగానికి సంబంధించి పోలీసు శాఖ నిర్దేశించిన నిబంధనలు మరియు సమయాలను తప్పనిసరిగా పాటించాలి.  మండపాల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా, రహదారులను పూర్తిగా ఆక్రమించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ వైరింగ్, మండప నిర్మాణం మరియు అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలి.   వినాయక విగ్రహాల ఊరేగింపు సమయంలో క్రమశిక్షణ పాటిస్తూ, పోలీసు శాఖ సూచించిన మార్గంలో మాత్రమే ఊరేగింపు నిర్వహించాలి. ఎలాంటి వివాదాలకు, రెచ్చగొట్టే చర్యలకు లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలకు పాల్పడరాదు.  ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి, వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, సురక్షితంగా మరియు సోదరభావంతో నిర్వహించుకోవాలని తెలిపారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి