అడ్డగూడూరు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా బాలెంల నరేష్ మాదిగ
అడ్డగూడూరు 6 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టు:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల ఇంచార్జ్ సూరారం రాజు మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఎమ్మార్పీఎస్ మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎం.ఆర్.పి.ఎస్ మరియు ఎం.ఎస్పి యదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ బిర్రు మహేందర్ మాదిగ సమక్షంలో నూతన మండల కమిటీ ని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన బాలెంల నరేష్ మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈసందర్భంగా నరేష్ మాదిగ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, జిల్లా, మండల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఎమ్మార్పీఎస్ను మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని, తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధిగా బోడ ప్రవీణ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా నిర్మల సందీప్ మాదిగ నియమితులయ్యారు. అలాగే ఎంఎస్పీ అడ్డగూడూరు మండల కమిటీ అధ్యక్షుడిగా బాలెంల మల్లేష్ మాదిగ, అధికార ప్రతినిధిగా బలెంల జనార్దన్ మాదిగ, పట్టణ అధ్యక్షుడిగా గజ్జెల్లి బాబు మాదిగలను నియమించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్రస్వామి మాదిగ, మండల కో ఇంచార్జ్ మాజీ అధికార ప్రతినిధి పడమటి సతీష్ మాదిగ, నరేష్ మాదిగ, సురేష్ మాదిగ, మల్లయ్య మాదిగ, పోలేపాక అబ్బులు, పరుశరాములు, వెంకటేష్, శివ తదితరులు పాల్గొన్నారు.