సోలార్ స్మార్ట్ మీటర్ల కార్యాలయాన్ని ప్రారంభించిన
పోలేటి బ్యూరో సభ్యులు తొండపు దశరథ జనార్ధన్ గారు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి:- సోలార్ స్మార్ట్ మీటర్ల కార్యాలయాన్ని ప్రారంభించిన పోలిట్ బ్యూరో సభ్యులు తొండపు దశరధ జనార్ధన్..... వత్సవాయి: మండలంలో మక్కపేట గ్రామం నందు దీప్తి ఎలక్ట్రికల్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ స్మార్ట్ మీటర్ల కార్యాలయాన్ని పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరధ జనార్దన్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సోలార్ మీటర్ వల్ల కరెంట్ ఆదా చేసుకోవడమే కాకుండా అనవసరమైన భారం ప్రజలపై ఉండదన్నారు.ఈ సోలార్ స్మార్ట్ మీటర్ వల్ల ఎస్ సి, ఎస్ టి లకు 200 యూనిట్లు లోపు ఉచిత కరెంట్ ఇస్తుందన్నారు.గత ప్రభుత్వం సామాన్యుడుపై అధిక భారం మోపిందన్నారు.కరెంట్ బిల్లు లు కూడా కట్టలేక పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 లోపు ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి మీటర్ రీడింగు సమయం దాటిన తర్వాత రీడింగ్ తీసి ప్రజలపై అధిక భారం మోపిందన్నారు. మన ప్రభుత్వంలో ప్రజలపై అధిక ఉండకూడదని మన ప్రభుత్వం ఆదాని గ్రూపుతో మాట్లాడి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా సోలార్ స్మార్ట్ మీటర్లు పెట్టి ఒకటో వ తారీఖు నుండి 30 వ తారీకు వరకు రీడింగ్ తీసుకుంటే 200 దాటితేనే ఎస్సీ ఎస్టీలకు బిల్లు కట్టే విధంగా ఆదాని గ్రూపుతో మన ప్రభుత్వం ఒప్పంద కుదిర్చుకున్నది అని అన్నారు. ముందు కమర్షియల్ వారికి సోలార్ స్మార్ట్ మీటర్లు అమర్చిన అనంతరం గృహలకు ఈ సోలార్ స్మార్ట్ మీటర్లు బిగిస్తారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కరెంటును ఆదా చేయాలనే ఆయన అన్నారు.అనంతరం కరెంటు ఏడి జె. శ్రీనివాస్ మాట్లాడుతూ సబ్సిడీపై మూడు కిలోల వాట్స్ వరకు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. లక్ష యాబై వేల నుండి రెండు లక్షలు వరకు ఖర్చు వస్తుందని అది ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.సబ్సిడీ కింద 70000 వేలు,బ్యాంకు ఋణం 130000 వేలు ప్రభుత్వమే ఇప్పిస్తుందన్నారు.నెలసరి వాయిదాలలో మనం బ్యాంకు కు చెల్లిచలన్నారు.మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, మీటర్ నెంబర్ మా కార్యాలయం వారికి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. సోలార్ కరెంట్ మనం వాడుకున్న అంతవరకు సెల్ లో రికార్డు అవుతుంది అని అన్నారు. రైతులకు చేలకు సోలార్ కరెంట్ కావాలనుకుంటే ఒక కిలోమీటర్ లోపు ఉన్న చేలకు ఎకరానికి 30 వేల రూపాయల చొప్పున లీజు ప్రభుత్వంమే భరిస్తుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, మక్కపేట గ్రామ సర్పంచ్ మల్లెల శివప్రసాద్, కరెంటు ఏఈ పి రవికుమార్, ఆదాని గ్రూప్ జేఈ పూర్ణ, దీప్తి ఎలక్ట్రికల్ వర్క్స్ ప్రొప్రైటర్ సందీప్,మాజీ ఎంపీటీసీ తాళ్ళూరి జీవమ్మ వెంకటరత్నం,అయినాల సాంబయ్య,దారావత్ రామారావు,తమ్మిశెట్టి శ్రీను,యండ్రాతి దావీడు,డేవిడ్,మదార్, గుడేటి వెంకటనారాయణ,కత్తి ప్రభాకర్,యండ్రాతి వీరబాబు,దోరెపల్లి వెంకటరత్నం,లంజపల్లి ప్రకాష్, కరెంట్ లైన్ మెన్ లు,హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు.