భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే
సూర్యాపేట: భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆద్య ఈవీ వరల్డ్ ఎంజీ వన్ భూమి ఎలక్ట్రికల్ బైక్, ఆటో షోరూంను ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్,నిర్వహణ తక్కువ ఖర్చు ఉండటంతో వాహనదారులు ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు.ప్రపంచానికి పర్యావరణ కాలుష్యం ముప్పుగా మారిన నేపథ్యంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరైందని అన్నారు.వాహనదారులకు నాణ్యమైన సేవలను అందించాలని అన్నారు.అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఎంజీ వన్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా, పర్యావరణ హితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో తయారు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, పిడమర్తి కీర్తి లవన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది దండు మైసమ్మ ఆలయ చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, అబ్దుల్ రహీం, కంపెనీ ఎండి సుప్రీత్ రెడ్డి, జిల్లా డీలర్ బూర మల్సూర్ గౌడ్,శుభం ఈవీ కోర్ మెంబర్ అమరగాని రాములు గౌడ్,వీరారెడ్డి, నిర్వాహకులు బానోతు పాపయ్య చిలుకమ్మ, సంజయ్ కుమార్, నారాయణ,జనార్ధన్, ప్రవీణ్ కుమార్, మజుబుద్దిన్, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.