ప్రభుత్వ విద్య తోనే...మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు....
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న
జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ...
మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్...
జోగులాంబ గద్వాల 15 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పట్టణంలోని 16వ వార్డ్ లోని ప్రభుత్వ అభ్యాసన ఉన్నత పాఠశాల నందు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యా దినోత్సవం ప్రోగ్రాం లో జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ...మరియు.. మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు..ముందుగా సరస్వతి,జయశంకర్ చిత్రపటాన్నికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి ప్రారంభించారు..
.అనంతరం జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ..మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ మాట్లాడుతూ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి,మీ పిల్లల భవిష్యత్తు కు బంగారు బాటలు వేసుకోవాలని సరితమ్మ పిలుపునిచ్చారు..గత ప్రభుత్వం విద్య పట్ల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ విద్యకు దూరమౌతున్న సందర్భం తెలంగాణ రాష్ట్రములో ఏర్పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తు ప్రభుత్వ పాఠశాలలో చదువుచున్న 10వ తరగతి విద్యార్థులకు 10/10 పాయింట్లు సాధించిన విద్యార్థులకు సిఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా కలిసి సన్మానించి ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత కల్పించిన ఘనత సిఎం రేవంత్ రెడ్డి కే దక్కుతుందని, ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన, క్వాలిఫైడ్ టీచర్లచే విద్యాబోధన తో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుచున్న విద్యార్థులకు ఉచితంగా చదువు,పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు... అనంతరం 2023-24 సంవత్సరం పదవ తరగతిలో 9 పాయింట్లుకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు శాలువా, మెమోటో లతో అభినందించారు...
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనిత శ్రీనివాస్ రెడ్డి,డిటిడిసి అనిత నర్సింహులు,మహేష్, టి.శ్రీనివాసులు,మహ్మద్ ఇసాక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు ఎల్లప్ప,తుమ్మల నర్సింహులు, నాగ శంకర్, భాస్కర్ యాదవ్,బంగీ సుదర్శన్,గోవింద్,కొత్త గణేష్,జమ్మిచేడు రాము, మోహన్ యాదవ్,ఎస్పీ దేవరాజు, షాష,రాము యాదవ్,పరుశ, పాఠశాల హెడ్ మాస్టర్ వెంకట నర్సయ్య తదితరులు ఉన్నారు