కురుమ సంఘం అధ్యక్షుడిగా నోముల ఉపేందర్
ఉపాధ్యక్షుడిగా నాగులపల్లి లక్ష్మణ్

అడ్డగూడూరు 10 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని కురుమ సంఘం అధ్యక్షునిగా నోముల ఉపేందర్ ను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అనంతరం కురుమ సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన నోముల ఉపేందర్ మాట్లాడుతూ..కురుమ సంఘం కోసం తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని,కురుమ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.నా ఎన్నికకు సహకరించిన కురుమ సంఘ సభ్యులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా నాగులపల్లి లక్ష్మణ్,కార్యదర్శిగా బండి కొమురయ్య ,సహాయ కార్యదర్శిగా ఆసర్ల బలరాములు, కోశాధికారిగా కంచర్ల చిన్న నర్సయ్యను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాగులపల్లి మల్లయ్య, నాగులపల్లి రమేష్,నాగులపల్లి నరసయ్య,నాగులపల్లి బీరప్ప, ఏనుగ బీరుమల్లు, బండి ఐలయ్య,బండి శ్రీశైలం,బండి యాదగిరి, ఆసర్ల మల్లు స్వామి, జోగు మల్లయ్య,చిన్న మహంకాళి,ఆసర్ల శ్రీనివాస్, ఆసర్ల యాదగిరి,ఆసర్ల మత్యగిరి, బండి మల్లయ్య,బండి మధు, బండి మహేష్,కురుమ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.