సమాజ నిర్మాణములో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

చేపూరి కృష్ణయ్య... పాఠశాల కరస్పాండెంట్
తుంగతుర్తి: సెప్టెంబర్ 11 తెలంగాణవార్త ప్రతినిధి:- సమాజ నిర్మాణములో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్ర కీలకమైనదని శ్రీ విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ చేపూరి కృష్ణయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీ విద్యా భారతి పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి రాష్ట్ర పదవి వరకు అంచలంచలుగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం నేటి ఉపాధ్యాయులకు మార్గదర్శకం అన్నారు. ఉపాధ్యాయుడు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారు ఎంచుకున్న రంగంలో రాణించేలా ఉపాధ్యాయులు చేస్తున్న కృషి మరువలేనిది అన్నారు నేడు సమాజంలో ఇంజనీర్లను డాక్టర్లను శాస్త్రవేత్తలను మేధావి వర్గాలను తరగతి గదులలో తయారు చేస్తున్న ఘనత ఉపాధ్యాయులకు మాత్రమే దక్కిందన్నారు. ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పి మల్లయ్య. డైరెక్టర్లు కోట వెంకట గోపాల్. ఎండి నజీర్ తో పాటు ఉపాధ్యాయులు లింగమూర్తి అంబటి రమేష్ ఈరోజు సురేష్ సరిత స్వప్న మున్ని అనిత సునీత రాధ ఉమ తదితరులు పాల్గొన్నారు