జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రభుత్వం
అభ్యర్థుల ఎంపికలో కసరత్తుల ప్రారంభించిన ప్రభుత్వం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు ప్రారంభించింది అని చెప్పొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన దరిమిలా జూబ్లీహిల్స్ జరిగే రెండవ ఉప ఎన్నిక అత్యంత దృష్టి సారించి గెలుపు కోసం కసరత్తుల ప్రారంభించినట్లు సమాచారం ఈ ప్రాంతంలో మైనార్టీ వర్గానికి టికెట్ చేయించాలని కొందరు మైనార్టీల వాదన కాగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అజారుద్దీన్ ఆదిష్టాన్ని సంప్రదించకుండా తానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నట్లు ప్రచారం చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ సామాజిక వర్గం విషయంలో ఒక స్పష్టమైన వైఖరితో ఉంది ఈ ఉప ఎన్నిక అభ్యర్థులలో బీసీ వర్గానికి సంబంధించిన వారికి కేటాయిస్తున్నట్లు మరోవైపు ప్రచారం నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టా నం తనకే టికెట్టు కేటాయిస్తుందని ధీమలో ఉన్నట్లు సమాచారం మరో కీలక నేత గతంలో జూబ్లీహిల్స్ కంచుకోటలో ప్రజలకు సేవలు అందించి పేరు ప్రఖ్యాతలు పొందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం హయాంలో ఒక వెలుగు వెలిగి ప్రజలకు నోట్లో నాలుకల మెదిలిన వ్యక్తి టిఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించి ప్రజల సమస్యల సాధన కోసం అహర్నిశలు కష్టించి మంచి పేరు తెచ్చుకున్న గుర్రం మురళి గౌడ్ జూబ్లీహిల్స్ హిల్స్ టికెట్ కోసం కృషి చేస్తున్నట్లు సమాచారం ఈ ఉప ఎన్నికలో ఆశావాహులు టికెట్ కేటాయింపు కోసం ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ అధిష్టానం మొదటి నుంచి వినబడ్డ నేతల పేర్లు గాక ఇతర పేర్లు తెరపైకి తెచ్చే అవకాశం ఉండవచ్చునని జూబ్లీహిల్స్ ప్రజలు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనా పార్టీ తీసుకునే నిర్ణయం కోసం అభ్యర్థులు వేసి చూడవలసిందనని విశ్లేషకుల అంచనా