సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె .
జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల.: సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె మంగళవారంతో 15వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో డిపిఓ వింగ్ అధ్యక్షుడు డి ఎల్ ఎండి. బి రామాంజనేయులు, ఎం ఐ ఎస్ వింగ్ అధ్యక్షుడు శ్రీధర్, సి సి ఓ వింగు అధ్యక్షుడు ఆల్తాఫ్, సి ఆర్ పి వింగ్ అధ్యక్షుడు ఎంఏ సమీ, అయి ఆర్ పి వింగ్ అధ్యక్షుడు మురళి , పి టి ఐ వింగ్ అధ్యక్షుడు రాజేందర్లు తో పాటు నేడు అదేవిధంగా జే ఎస్ సి జిల్లా అధ్యక్షుడు హుషనప్ప , జేఏసీ ప్రధాన కార్యదర్శి గోపాల, కస్తూర్బా బాలికల విద్యాలయం మహిళా అధ్యక్షురాలు ఎస్పీ .ప్రణిత సమగ్ర శిక్ష లోని అన్ని వింగుల అధ్యక్షులు పాల్గొని నేడు నిరవధిక సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. .
వారి ప్రధాన డిమాండ్. ముఖ్యమంత్రివర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని రెగ్యులర్ చెయ్యాలి. అప్పటి వరకు పే స్కేల్ అమలు కల్పించాలి అని డిమాండ్ చేశారు.