డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే గారు
ఈరోజు గద్వాల పట్టణ శివారు లో నిర్మించి దిక్కు ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇటీవల మంత్రుల చేతుల మీదుగా అందజేశారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు తమకు కేటాయించిన లబ్ధిదారుల తో మాట్లాడారు. కుటుంబ సమేతంగా అందరూ చిక్కడే నివసించారని ఇప్పటికే కరెంటు తాగునీరు డ్రైనేజీ వంటి వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చామని మిగతా మౌలిక వసతులను కూడా వారం పది రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా అక్కడ పనులు చేస్తున్న డ్రైనేజీ, రోడ్లు, బిల్డింగు కు కలర్స్ వంటి పనులు చేస్తున్న అధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తిచేసి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సొంతింటి కలను నెరవేర్చిన ఎమ్మెల్యే గారికి లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.