బాగా చదువుకుని మంచి పేరు తేవాలి జిల్లా కలెక్టర్

తిరుమలగిరి 02 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మంగళవారం తిరుమలగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సభాస్థలి పరిశీలనలో భాగంగా వచ్చిన జిల్లా కలెక్టర్ తేజస్ ,జిల్లా ఎస్పీ నరసింహ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. బాలుర రెసిడెన్షియల్ స్కూలు నందు పదవ తరగతి క్లాసును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదవాలని ముందు ప్రణాళికతో అభ్యసించాలని లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రణాళికను రూపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అందరూ బాగా చదువుకొని జిల్లాకు మంచి పేరు తేవాలని వచ్చే పదవ తరగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమానం అందజేస్తానని కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నేను, ఎస్పీ ఇద్దరం గ్రామస్థాయి నుండి చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నామని కలెక్టర్ తెలిపారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడితే మాకు ఆనందంగా ఉంటుందని తెలిపారు. అనంతరం పట్టణంలోని బహిరంగ సభ కొరకు సభాస్థులని పరిశీలించారు. ఈనెల 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నందున మున్సిపల్ పరిధిలోని మాలిపురంలో స్థలాన్ని పరిశీలించారు, అక్కడనుండి తాసిల్దార్ కార్యాలయం పక్కన గల స్థలాన్ని వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కొరకు అందరూ తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు డి ఆర్ డి ఓ వివి అప్పారావు ఆర్డిఓ వేణుమాధవ్రావు ,ఎంపీడీవో లాజర్ తాసిల్దార్ హరిప్రసాద్ డిఎస్పి ప్రసన్నకుమార్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.....