కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు 

Mar 13, 2026 - 20:50
 0  0
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు 
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు 

 హైదరాబాద్,14 మార్చి 2026(శనివారం) తెలంగాణ వార్త :- మహేశ్వరం నియోజకవర్గంలో పరిధిలోని ఆర్కే పురం డివిజన్ వాస్తవ్యులు రాష్ట్ర నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా అభిమానులు నిర్వహించారు.పుట్టినరోజు సందర్భంగా గజమాలతో,  పూల బొకేలతో మరియు శాలువాలతో సత్కరించి తదనంతరం కార్మికుల సమక్షంలో కేక్ కత్తిరించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానాన్ని చాటుకున్నారు. చిలుక ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ నాకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా మహిళలకు, మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి కార్యదర్శి మహేశ్వరం  నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేపా భాస్కర్ రెడ్డి,మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ క్యారగారి శ్రీధర్,ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షులు ముప్పిడి లింగస్వామి గౌడ్,ఖిల్లా మైసమ్మ టెంపుల్ చైర్మన్ సురేందర్ కుమార్,మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ మైత్రి ఆనంద్,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మిత్రులు, శ్రేయోభిలాషులు,  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333