12వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు లేవా

Mar 13, 2026 - 20:51
 0  0

 జోగులాంబ గద్వాల 13 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల. జిల్లా కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని గ్రామ పంచాయతీలు అన్ని మున్సిపాలిటీలు అన్ని వార్డులు అభివృద్ధి చేయుటకు సమానం. కానీ అధికారం వచ్చాక నా పార్టీ నీ పార్టీ అంటూ వార్డులను పంచుకొని అభివృద్ధికి తిలోదకాలు పలుకుతున్నారు. నా పార్టీ కాదు ప్రజల ముఖ్యం అన్న ప్రతిపక్ష కౌన్సిలర్లకు ప్రభుత్వం సహకరించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గద్వాల 12 వార్డ్ గంటగేరి కౌన్సిలర్ డ్రైనేజీ విషయంలో రెండు రోజులు జెసిబి అవసరమని రెండు రోజుల నుంచి మున్సిపల్ చైర్మన్ మరియు సిబ్బందిచుట్టూ తిరిగిన ఫలితం లేదని తెలిసింది. దీనికి సంబంధించి ఈ నెల రెండున ఒక అప్లికేషన్ కూడా ఇచ్చాను. స్పందించని మున్సిపల్ కమిషనర్ 99 రోజులు 10 సూత్రాలు సమగ్ర అభివృద్ధి మార్గాలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేను ఈ డ్రైనేజీ ని క్లీన్ చేపియాలని సంకల్పంతో ఉన్నాను .కానీ నా మాటను కమిషనర్, కానీ మున్సిపల్ సిబ్బంది కానీ స్పందించడం లేదని 12వ వార్డు కౌన్సిలర్ లత రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నా కాలిలో మరమ్మతులు కానీ ఇంకా కొన్ని పనులు కానీ చేయాలని ఆమె కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333