కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, పార్లమెంటు లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై
అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకుల దిష్టి బొమ్మ దహనం
సూర్యాపేట బీజేపీ కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, శివసేన నాయకులు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీమంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఆదేశాల మేరకు, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు,పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ల సూచన మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద బిజెపి నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నినాదలు చేస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యం.డి. అంజద్ అలి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్ లు మీడియా తో మాట్లాడుతూ బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పై వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి తన్విందర్ సింగ్ బిట్టు, సంజయ్ గైక్వాడ్ లపై పోలీస్ లు అట్టెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలని ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా బీజేపీ నాయకులు ఇష్టంవచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని బీజేపీ నాయకులు బయపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ప్రజల్లో రాహుల్ గాంధీ పై పెరుగుతున్న ఆదరణ ను తట్టుకోలేకపోతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పై ఇకనైనాఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, లేదంటే బీజేపీ నాయకులను తిరగనివ్వము అని హెచ్చరించారు.