గట్టికల్లు గ్రామంలో మంచి నీటి కష్టాలు బిందెలతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు

Sep 18, 2024 - 20:11
Sep 19, 2024 - 01:22
 0  23
గట్టికల్లు గ్రామంలో మంచి నీటి కష్టాలు బిందెలతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ గట్టికల్ గ్రామంలో లోని ఎస్సీ కాలనీ కి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు రంగు కాటమయ్య ఇంటి దగ్గర ఉన్నటువంటి బోరు కు కార్యదర్శి గారిచొరవతో మోటారు రిపేర్ చేయించారు కానీ కరెంటు ఓవర్ లోడ్ వల్ల మోటారు నడవడం లేదు నీళ్లు లేక ఇక్కడ కాలనీవాసులు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కావున ఈ గ్రామపంచాయతీ మోటార్ కి ట్రాన్స్ ఫార్మర్ ఇప్పించాలని నీటి సమస్య తీర్చాలని నీటి బిందెలతో ఇక్కడ రోడ్డుమీద మహిళలు ధర్నా చేశారు. కార్యదర్శి గారు కరెంటు ఏఈ గారితో మాట్లాడి సమస్య తీరుస్తాం అనడంతో విరమించుకున్నారు ఈ కార్యక్రమంలోమడ్డి పుష్పలత,రంగు భాగ్యమ్మ గిలకత్తు ల జానకమ్మ, ఉయ్యాల పద్మ ,అంకం సుజాత,మడ్డి రాజమ్మ మడ్డి శ్రీను అంజయ్య, గుండు లింగయ్య తదితరులు పాల్గొన్నారు