ఆరవ తరగతి ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి:జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్
జోగులాంబ గద్వాల 10 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- 2025-26 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయం, వట్టెం గ్రామం బిజినేపల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లా నందు ఆరవ తరగతి ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థుల కోసం నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు అయన తెలిపారు. నవోదయ పరీక్ష 18-01-2025 నాడు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంపిక పరీక్షకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కొరకు మండల విద్యాశాఖ అధికారులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకొని విద్యార్థులు యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించేందుకు చొరవ తీసుకోవాలని ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అధిక సంఖ్యలోదరఖాస్తు చేసుకోవాలని కోరారు.