ప్రారంభమైన మండల స్థాయి పాఠశాల క్రీడోత్సవాలు .

. ఎస్ ఐ .వై సైదులు పాఠశాల ఆవరణలో ప్రారంభించారు

Sep 18, 2024 - 20:09
Sep 19, 2024 - 01:26
 0  20
ప్రారంభమైన మండల స్థాయి పాఠశాల క్రీడోత్సవాలు .

తెలంగాణవార్త ఆత్మకూరు యస్ ప్రారంభమైన మండల స్థాయి పాఠశాల క్రీడోత్సవాలు ఆత్మకూర్ ఎస్.. చదువుతోపాటు క్రీడల్లో నైపుణ్య సాధించాలని అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని దీనికోసం క్రమశిక్షణతో కృషి చేయాలని ఎస్ ఐ వై సైదులు తెలిపారు.మండల స్థాయి పాఠశాల క్రీడోత్సవాలు బుధవారం జడ్పిహెచ్ఎస్ ఏపూరు పాఠశాల ఆవరణలో ప్రారంభించి ఆయన మాట్లాడారు.వివిధ పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొనగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడలని SGF కన్వీనర్ మండల విద్యాధికారి పి. దారాసింగ్, మండల నోడల్ అధికారి మురళి కృష్ణ చేతులమీదుగా క్రీడలు నిర్వహిస్తున్నారు. దీనిలో మండలంలోని దాదాపు అన్ని ఉన్నత పాఠశాలల నుండి సీనియర్ విభాగంలో కబడ్డీ వాలీబాల్ కోకో విభాగాల్లో క్రీడలు జరుగుతున్నాయని రేపు జూనియర్ విభాగంలో క్రీడలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.