ఒకే సంస్థలో ఒకే రూల్ కావాలంటూ ఆర్టీజన్ ఉద్యోగుల వంటావార్పు

Apr 2, 2026 - 20:55
 0  0
ఒకే సంస్థలో ఒకే రూల్ కావాలంటూ ఆర్టీజన్ ఉద్యోగుల వంటావార్పు

సూర్యాపేట, 02 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:–: ఒకే సంస్థలో ఒకే రూల్ అమలు చేసి ఆర్టీజన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ ఎంప్లాయిస్ జేఏసి చైర్మన్ గణేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎన్ని మార్లు విన్నవించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఆర్టీజన్ ఉద్యోగుల మస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీజన్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎస్ఇ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున వంటవార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పని చేస్తున్న అందరికి ఎపీఎస్ బి సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. బిల్ కలెక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆన్మాన్డ్ కార్మికులకు ఆర్టీజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ వంటావార్పు కార్యక్రమానికి అన్ని ట్రేడ్ యూనియన్లు, టివిఎఇ జేఏసి నాయకులు సంఘీబావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీజన్ ఎంప్లాయిస్ జేఏసి కన్వీనర్ తిరుపయ్య, నర్సింహ్మచార్యులు, కొండ నకులుడు, వీరభద్రం, పబ్బు మల్లయ్య, నాగమణి, దీప్తి, శ్రీదర్రెడ్డి, నాగరాజు, వెంకన్నలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333