రోడ్డు ప్రమాదంలో ఆశా వర్కర్ నాగమణికి తీవ్ర గాయాలు

Jun 24, 2026 - 19:56
Jun 24, 2026 - 23:28
 0  13
రోడ్డు ప్రమాదంలో ఆశా వర్కర్ నాగమణికి తీవ్ర గాయాలు

ఆత్మకూరు, జూన్ 23:- సూర్యాపేట పట్టణం నుంచి స్వగ్రామమైన ఆత్మకూరుకు వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు గ్రామానికి చెందిన ఆశా వర్కర్ నాగమణి తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే, నాగమణి తన స్కూటీపై సూర్యాపేట నుంచి ఆత్మకూరుకు బయలుదేరారు. మార్గమధ్యలో క్రషర్ మిల్లు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఆమె స్కూటీని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నాగమణికి తీవ్ర గాయాలు కాగా, స్కూటీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం సూర్యాపేట పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్ వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333