ఐఎస్ఐ విద్యుత్ పరికరాలనే వాడాలి:జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీ దాస్

ఈనెల 14 నుండి 20 వరకు అగ్నిమాపక దళ వారోత్సవాలు.

Apr 18, 2024 - 12:07
 0  10
ఐఎస్ఐ విద్యుత్ పరికరాలనే వాడాలి:జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీ దాస్
ఐఎస్ఐ విద్యుత్ పరికరాలనే వాడాలి:జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీ దాస్

జోగులాంబ గద్వాల 18 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల., -గృహాలు వ్యాపార సముదాయాలు నిర్మించేవారు ఐఎస్ఐ మార్కు గల విద్యుత్ పరికరాలను వాడాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీ దాస్ తెలిపారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలలో నిర్వహిస్తున్నారు. 1944 ఏప్రిల్ 14వ తేదీన ముంబై విక్టోరియా డాక్టర్లు ఒక నౌకకు అగ్నిప్రమాదం సంభవించి విధి నిర్వహణలో అసువులు బాసిన 66 మంది అగ్నిమాపకళాల సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు దేశవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అగ్నిమాపక శాఖ అగ్ని ప్రమాద సమయంలోనే కాకుండా వరదలు రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

 ప్రమాదంలో ప్రకృతి వైపరీత్యాలలో ప్రాణ నష్టం జరగకుండా కాపాడుట మా ప్రధాన కర్తవ్యం అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 101 కు సమాచారం మీ పేరు ఫోన్ నెంబర్ మరియు ప్రమాదం జరిగిన ప్రదేశం అడ్రస్ తమకు ఇవ్వాలన్నారు. గృహాలలో వంట ఇంటిలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐఎస్ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలని ఉపయోగించాలన్నారు. వంటింటి క్రింద పై భాగాలలో గాలి వెలుతురు ఉండేటట్లు చూడాలన్నారు. గ్యాస్ వాడకం పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ ఆపివేయాలని గ్యాస్ లీక్ అవుతున్నట్టు సమాచారం వస్తే వెంటనే రెగ్యులేటర్ వాల్ ఆపివేయాలన్నారు. ఆ సమయంలో ఎలక్ట్రిక్ స్విచ్లు వేయరాదని తెలిపారు. గోదాములో గిడ్డంగులు తాత్కాలిక నిర్మాణాలు పందిళ్లు లో జాగ్రత్తలు వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులు జాగ్రత్త వహించి గడ్డివాములను ఒకే చోట కాకుండా కనీసం 30 అడుగుల దూరంలో వేసుకోవాలన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది గౌస్ పాషా, రామ్ దాస్, లక్ష్మీ నాయక్, ప్రకాష్ రెడ్డి, బుగ్గన, నాగరాజు, రాజశేఖర్ మైనుద్దీన్, శంకర్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333