ఫిబ్రవరి 24 మంగళవారం రోజున చలో సెక్రటేరియట్
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ మన ముఖ్య డిమాండ్ల సాధనకై 24/02/2026 మంగళవారం రోజు న మధ్యాహ్నం 2.00PM సమయం కి సెక్రటేరియట్ వద్ద ధర్నా చేయుటకు తప్పనిసరిగా హాజరు కావలసిందిగా విజ్ఞప్తి. మన ముఖ్య డిమాండ్లు ఐన
1) ఆర్టీసీ నీ వెంటనే ప్రభత్వంలో విలీనం చేయడం
2) ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం
3) ఆర్టీసీలో మళ్లీ యూనియన్ల ను పునరుద్ధరించడం
4) 2021, 2025 పే స్కేల్ చేయడం
5) ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించడం
6) ఆర్టిసి ఉద్యోగులకు రావాల్సిన డబ్బులు 2017 ఎరియర్స్ ను సకాలంలో ఇప్పించడం
7) చనిపోయిన ,,మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగస్తుల స్థానములో వారి పిల్లలకు ఉద్యోగం అవకాశం కల్పించిన,,, పద్ధతి సరైనది కాదు.. క్యాజువల్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ పద్ధతిలో తీసుకోవాలి, ఇప్పటికే తీసుకున్నవారిని వెంటనే రెగ్యులర్ చేయాలి
8) రిటైర్డ్ ఐన ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా,,రెగ్యులర్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకొని ఇప్పుడు చేస్తున్న ఉద్యోగస్తుల పని భారాన్ని తగ్గించాలి.
వీటన్నిటి సమస్యల పరిష్కారం కొరకు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయనైనది.. కావున ఉద్యోగులందరూ వాస్తవాన్ని అర్థం చేసుకొని డబల్ డ్యూటీలకి వెళ్లకుండా తప్పనిసరి పరిస్థితుల్లో మన ఐక్యతను చాటడానికి 24/02/ 2026 రోజున హైదరాబాదులో జేఏసీ పిలుపు మేరకు ఏర్పాటు చేసిన చలో సెక్రటేరియట్ ప్రోగ్రామును అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి. దీనిలో భాగంగా ఉద్యోగులను సమాయత్తం పరచడానికి 17/02/2026 న 10.30AM కు కోదాడ డిపో వద్ద మరియు,,12.30PM కు SRPT డిపో, వద్ద చలో సెక్రటేరియట్ ప్రోగ్రాం గురించి ఉద్యోగులను సమాయత్తము చేయటంలో భాగంగా సభలు ఏర్పాటు చేయడమైనది.. కావున 0FF /S. OFF & నైట్ అవుట్ I/C లలో ఉన్నవారు ఈరోజు ప్రోగ్రాం కి హాజరు కాగలరని విజ్ఞప్తి
చలో సెక్రటేరియట్ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి కోదాడ మరియు సూర్యాపేట్ డిపో ఉద్యోగస్తులు అందరికీ కలిపి ఒక బస్సునుకూడా ఏర్పాటు చేయడమైనది.. బస్సుతోపాటు,, మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా బస్సులోనే ఉంటుంది.. కాబట్టి అధిక సంఖ్యలో ఉద్యోగులు అందరూ అర్థం చేసుకొని *ఇది ప్రతి ఒక్కరి సమస్యగా భావించి ఎవరూ కూడా
డబల్ డ్యూటీలకి వెళ్లకుండా,, స్పెషల్ ఆఫ్ లో ఉన్నవారు,, హాఫ్ లో ఉన్నవారు,, ఇన్కమింగ్ అయినవారు,, అందరూ కూడా ఐక్యతతో ముందుకు కదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..
ఇట్లు
1) బుడిగె పుల్లయ్య
(7382823454)
ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి
2) సుంకరి శ్రీనివాస్ (9396811411)
ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి
3) ఎస్ ఎస్ గౌడ్* (9989457278)
ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నల్లగొండ రీజియన్ కార్యదర్శి
4) కోదాడ డిపో కమిటీ
5) సూర్యాపేట డిపో కమిటీ