సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు

Apr 17, 2024 - 22:02
Apr 18, 2024 - 11:17
 0  116
సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు

తెలంగాణ వార్త ఆత్మకూరు ప్రతినిధి ఏపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఆలయ కమిటీ మెంబెర్స్, అర్చకులు గ్రామ పెద్దలు మొదలైన వారందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా స్వామి వారికి తీసుకొచ్చిన పెళ్లి బట్టలు మెట్టెలు పుస్తెలు పట్టు వస్త్రాలు సమర్పించారు కళ్యాణ మహోత్సవం జరిగిన అనంతరం భక్తులు తెచ్చిన వస్త్రాలను వేలంపాటగా భక్తులు చెంతకు చేర్చారు