ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో డి ఎమ్ హెచ్ ఓ కు సన్మానం
జోగులాంబ గద్వాల 17 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కిరణ్మయి ని ఈ నెల 17న సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి) జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ ఆర్ పి జయప్రకాష్ సారథ్యం లో ఘనంగా సన్మానం చేశారు. ముందుగా జిల్లా యూనియన్ నాయకులు శాలువా కప్పి, బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు, యూనియన్ సలహాదారులు సాదిక్, జనరల్ సెక్రటరీ ఆర్ కిరణ్ కుమార్, యూనియన్ నాయకులు అనిల్, కృష్ణ,నరేందర్, విజయ్, గోపాల్, వెంకటేష్, రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.