ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ లు ఎన్నిక

Dec 5, 2025 - 05:08
Dec 5, 2025 - 05:21
 0  203
ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ లు ఎన్నిక

  తిరుమలగిరి 05 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

   తిరుమలగిరి  మండలంలోని కోక్యా నాయక్ తండ , సిద్ధి సముద్రం , రాజ నాయక్ తండా గ్రామ పంచాయితీ ఆవరణలలో గ్రామ ఉప సర్పంచి ఎన్నికని స్టేజ్ 2 అధికార్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయా గ్రామాల ఏకగ్రీవ వార్డ్ సభ్యులు మరియు సర్పంచ్ లు ఇట్టి ఎన్నికలో పాల్గొని మెజారిటీ సభ్యులు చేతులెత్తడం ద్వారా ఉప సర్పంచ్ ఎన్నికని పూర్తి చేయడం జరిగింది. 1 కోక్యా నాయక్ తండా ఉప సర్పంచ్ గా  గుగులోతు సురేందర్  2 రాజా నాయక్ తండా ఉప సర్పంచ్ గా  మాలోత్ మోహన్   3 సిద్దిసముద్రం ఉప సర్పంచ్ గా  ధరావత్ బాలు ఏకగ్రీవంగా ఉప సర్పంచిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేజ్ 2 అధికారులు  . మల్లయ్య , P. మల్లయ్య , శ్రీశైలం , గ్రామ కార్యదర్శులు నాగలక్ష్మి , కిరణ్ , బాబు లాల్ తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి