రాష్ట్రంలో అధిక ఎండలు ఉమ్మడి పాలమూరులోనే!

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు అప్పుడే మంట పుట్టిస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడి పెరిగింది. రాష్ట్రంలోని అత్య ధికంగా వనపర్తి జిల్లాలో 39, జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 38.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది.