సంక్రాంతి సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం

ఆత్మకూరు యస్ 14 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్ :- బహుమతుల ప్రధానోత్సవం ఆత్మకూర్ సంక్రాంతి పర్వదిన సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామస్థాయి క్రికెట్ పోటీలలో గణేష్ యూత్ ప్రథమ బహుమతి గెలుచుకుంది. కథ మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతి అందించారు. మండల కేంద్రానికి చెందిన గణేష్ యూత్ ప్రథమ బహుమతి గెలుచుకోగా అంబేద్కర్ యూత్ ద్వితీయ బహుమతి గెలుచుకుంది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యువత చదువుతోపాటు ఆటల్లో రాణించాలని క్రీడలు ఐకమత్యానికి నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో గునిగంటి సతీష్ బట్టుపల్లి శరత్చంద్ర సోమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సతీష్, దాసరి పరమేష్ తదితరులు ఉన్నారు.