ఎస్. బి. ఐ . ఫౌండేషన్  మరియు భవిష్య భారత్ ఆధ్వర్యంలో గ్రామ సేవ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.  నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి

Jan 20, 2026 - 19:44
 0  5

జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్.

 జోగులాంబ గద్వాల 20 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  అలంపూర్ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం లోని మనోపాడు మండలంలోని చెన్నిపాడు, పోతులపాడు గ్రామాలలో జరిగిన ఎస్బిఐ గ్రామ సేవా కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. అలంపూర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎస్ బి ఐ ఆల్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టి  మనోపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామ నివాసి అయినా ఆయన ఐదు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ SBI వారు  గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మంచిదని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో  SBI అధికారులు,ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333