**ఎఫ్ ఆర్ ఎస్ ద్వారా హాజరు నమోదు కట్టుదిట్టం నమోదు చేయాలి""జిల్లా కలెక్టర్ అనుదీప్ దురి శెట్టి*

Aug 12, 2025 - 17:31
 0  23
**ఎఫ్ ఆర్ ఎస్ ద్వారా హాజరు నమోదు కట్టుదిట్టం నమోదు చేయాలి""జిల్లా కలెక్టర్ అనుదీప్ దురి శెట్టి*

*ప్రచురణార్థం**ఎఫ్.ఆర్.ఎస్. ద్వారా హాజరు నమోదు కట్టుదిట్టంగా నమోదు చేయాలి.... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*

**విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ అధికంగా ఉన్న 237 పాఠశాలల్లో టీచర్ల కొరత రాకుండా చర్యలు*

**యూ.డి.ఐ.ఎస్.సి పోర్టల్ లో పాఠశాల వివరాలను అప్ డేట్ చేయాలి*

**పాఠశాలలో బ్యాగ్ లెస్ డే నిర్వహించాలి*

**ఎఫ్.ఆర్.ఎస్. విధానంలో హాజరు నమోదుపై విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్*

-----------------------------

తెలంగాణ వార్త ప్రతినిధి రా వెళ్ళ.  ఖమ్మం, ఆగస్టు 12:

-----------------------------

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎఫ్.ఆర్.ఎస్. ద్వారా హాజరు నమోదు కట్టుదిట్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ఎఫ్.ఆర్.ఎస్. విధానంలో హాజరు నమోద పై విద్యా శాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* పాఠశాలలో ఉపాధ్యాయులకు సెలవు మంజూరు సమయంలో పాఠాలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల, చదివే విద్యార్థుల పూర్తి వివరాలు ఎఫ్.ఆర్.ఎస్. లో 3 రోజులలో ఎన్ రోల్ చేయాలని అన్నారు. విద్యా శాఖలో ఉపాధ్యాయులకు జారీ చేసిన డిప్యూటేషన్ పై రివ్యూ నిర్వహించాలని అన్నారు.

ఖమ్మం జిల్లాలో 1600 ప్రభుత్వ పాఠశాలల్లో 65 వేలకు పైగా విద్యార్థులు చదువుతుంటే, వీటిలో 237 పాఠశాలల్లో 56 వేల 300 మంది విద్యార్థులు ఉన్నారని, ఈ 237 పాఠశాలల్లో ఎక్కడా టీచర్ కొరత రాకుండా చూడాలని, సాంక్షన్ పోస్ట్ లను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని కలెక్టర్ మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 

మండలంలో ఉన్న హెడ్ మాస్టర్ లకు ఎఫ్.ఆర్.ఎస్. లో ఉన్న సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలకు విద్యార్థులు గైర్హాజరయితే రెగ్యులర్ ఫాలో అప్ చేయాలని అన్నారు. టీచర్లు, విద్యార్థుల హాజరు అంశం అత్యంత ప్రాధాన్యతగా పరిగణించడం జరుగుతుందని అన్నారు. 

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఎఫ్.ఆర్.ఎస్. 77 శాతం ఉండటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ క్రింద పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది పని తీరు మెరుగు పర్చుకోవాలని అన్నారు. 3 నెలల సమయంలో పని తీరు రివ్యూ చేయడం జరుగుతుందని, మంచి ఫలితాలు రాని పక్షంలో చర్యలు తీసుకుంటామని అన్నారు.  

యూ.డి.ఐ.ఎస్.సి. పోర్టల్ లో పాఠశాల సంబంధించి వివరాలను 15 రోజుల్లో అప్ డేట్ చేయాలని, ఎం.ఐ.ఎస్ ఆపరేటర్లు, హెడ్ మాస్టర్ లతో సమన్వయం చేసుకుంటూ వివరాలను నమోదు చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆగస్టు చివరి నాటికి అపార్ నెంబర్ జనరేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మెరిట్ విద్యార్థులను పీఎంశ్రీ ఫీల్డ్ విజిట్ క్రింద స్పెస్ స్టేషన్ తీసుకొని వెళ్ళెందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. పాఠశాలల్లో ఒక రోజు *బ్యాగ్ లెస్* డే గా పెట్టాలని, ఆ రోజు పిల్లలతో గ్రూప్ డిస్కషన్, డిబేట్, క్రీడలు మొదలైన వివిధ కార్యక్రమాల అమలు కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి నాగ పద్మజ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------------

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం ఖమ్మంచే జారీ చేయనైనది.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State