పేదల బియ్యం డీలర్లకు వరం
తిరుమలగిరి 17 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
లబ్ధిదారుల నుండే బియ్యం కొనుగోలు..
దళారులతో కలిసి డీలర్ల అక్రమ వ్యాపారం…
పట్టించుకోని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు
తుంగతుర్తి నియోజకవర్గం లో జోరుగా రేషన్ డీలర్ల దందా
తిరుమలగిరి మండలంలో అధికం
పట్టించుకోని అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ప్రజాపంపిణి ద్వారా అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి.. రేషన్ డీలర్లు, దళారుల తో చేతులు కలిసి సొమ్ము చేసుకుంటున్నారు. దళారులు రాత్రి వేళల్లో సరిహద్దులు దాటించి లక్ష లు సంపాదిస్తున్నారు.. తిరుమలగిరి మండలం రేషన్ డీలర్లు ఒక గ్రూప్ గా ఏర్పడి తమ వ్యాపారాన్ని దర్జాగా సాగిస్తున్నారు.. స్థానిక తిరుమలగిరి తొండ వెలిశాల మామిడాల మాలిపురం గుండె పూరి బండ్లపల్లి జలాల్పురం అనంతరం తాటిపాముల నందపురం తో పాటు పలు పలు గిరిజన తండాలు ఏరియా లో ని రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుండి నేరుగా కిలో రూ 05 నుండి 08 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన బియ్యం ను అనుకూలమైన సమయం లో బియ్యం దందా చేసే వ్యక్తి కి కిలో రూ 15 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటూన్నారు. బహిరంగ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఇంత జరుగుతున్న సంబంధిత రెవెన్యూ, పౌర సరఫరా శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీ చేసే పరిస్థితి లేదు.అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహారించడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డీలర్లు ప్రతి నెల సంబంధిత అధికారులకు మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు
కిలో రూ.8 కొనుగోలు చేసి..
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల వ్యాప్తంగా పలు గ్రామాల డీలర్లు గ్రూపుగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని రూ.5 నుంచి రూ. 8కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు కాకినాడ ఫోర్టుకు రూ.15 నుంచి రూ. 18లకు అధిక ధరలకు అక్రమంగా తరలిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ వ్యాపారులకు కొందరు రేషన్ డీలర్ల మద్దతు ఉండడం వల్లనే భారీ స్థాయిలో పీడీఎస్ బియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి
ఓ మహిళ రేషన్ డీలర్ జోరుగా దందా. ??
తిరుమలగిరి మండలం లోని ఓ గ్రామంలో ఓ మహిళ రేషన్ డీలర్ ఇంటి వలె తమ పదవీకాలం పూర్తి చేసుకున్న ఓ ప్రజా ప్రతినిధి అండదండతో నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో విచ్చలవిడిగా బియ్యం దందా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు ఎన్నోసార్లు ఆమెపై ఫిర్యాదు చేసిన పత్రికల్లో ప్రచురించిన ఆ డీలర్ పై అధికారులు చర్యలు తీసుకోవడం విఫలమయ్యారు అని ఆరోపణలు
దర్జాగా దందా.....
మొక్కుబడిగా, నామ మాత్రంగా, తూతూ మంత్రంగా, దాడులు జరపడం వల్లన అక్రమ బియ్యం దందాకు అరికట్టు లేకపోతునారు ఆని పెద్ద ఎత్తున ఆరోపణలు. బియ్యం దందా పట్ట పగలు ప్రధాన రహదారుల వెంట జరుగుతున్న పట్టు కోవలసిన అధికారులే ఏం పట్టనట్టు వ్యవహరించడం పై బహిరంగ ఆరోపణలు లేకపోలేదు.
ఊరి చివర ఉన్న ఇళ్లే అడ్డాలు..
జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా కొనసాగుతోంది. అక్రమ రవాణాదారులు సిండికేటుగా ఏర్పడి, రేషన్ బియ్యాన్ని ద్విచక్రవాహనాలు, ఆటోలు, టాటాఏసీ వాహనాలల్లో బియ్యం బస్తాలను తీసుకువచ్చి.. పాత రైస్‌మిల్లులు, రోడ్డు సౌకర్యం ఉండి ఊరు చివరన ఉన్న ఇళ్లలో అడ్డాలుగా ఏర్పాటు చేసుకుని, డంప్ చేస్తారు. భారీ మొత్తంలో జమచేసిన తర్వాత రాత్రి సమయాలల్లో టర్బో లారీల్లో కాకినాడ ఫోర్టుకు అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడి నుం చి ఇతర రాష్ట్రాలకు తరలుతున్నాయి
అధికారులకు సవాల్‌గా..
పీడీఎస్ అక్రమ దందా సంబంధిత అధికారులకు సవాల్‌గా మారుతోంది. నిలువరించేందుకు అధికారులు నిఘా ఏర్పాటు చేస్తున్నప్పటికీ వారి కంట్లో పడకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఓ వ్యాపారి పాత ఇంటిలో 15 క్వింటాల రేషన్ బియ్యాన్ని నిల్వ చేశారనే సమాచారంతో ఆ ఇంటిపై స్థానిక గత ఎస్సై సత్యనారాయణ గౌడ్ దాడి చేసి, బియ్యాన్ని సీజ్ చేశారు. మండలంలోని . పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ అక్రమ బియ్యం దందా మాత్రం ఆగడం లేదని పలువురు తెలుపుతున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ పై పర్యవేక్షణ కరువు..
ప్రజా పంపిణీ వ్యవస్థ పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డీలర్ల దందా అడ్డు లేకుండా పోతుంది. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్న క్షేత్రస్థాయిలో అధికారులు ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. రేషన్ డీలర్లు కొనుగోలు చేసిన బియ్యం క్వింటాళ్ల కొద్దీ దళారులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు కానీ పౌరసరఫరా శాఖ అధికారులు కానీ ఏనాడు రేషన్ షాపులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. రేషన్ డీలర్లు బియ్యాన్ని పక్కదారి పట్టకుండా చూసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ యంత్రాలు తీసుకువచ్చింది. అయినా కూడా వారి దందా మాత్రం ఆగడం లేదు. వేలిముద్రలు వేసి బియ్యం తీసుకోవాల్సిన వినియోగదారులు అక్కడే డీలర్ కు విక్రయిస్తున్నారు. ప్రతినెల 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్న కొంతమంది డీలర్లు వారం రోజులు మాత్రమే పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రతి నెల రేషన్ షాపులకు వచ్చిన కోటా ఎంత? వినియోగదారులు తీసుకున్నవి ఎన్ని? మిగిలిన కూడా ఎంత? అనే లెక్కలు తెలుస్తున్నాయి. కానీ పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం షాపులను తనిఖీ చేయడం లేదు. పంపిణీ అయిన కోటా కన్న పోను మిగిలిన కోటాకు మించి షాపులోనే ఉంటున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నా యి. రాత్రి వేళల్లో డీలర్లు షాపుల నుండి దళారులకు విక్రయిస్తున్నారు.. బియ్యం దందా చేసే వాళ్లు ఎక్కడెక్కడ ఉంటారో అధికారులకు తెలిసినప్పటికీ పెద్దగా పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ బియ్యం దందాలో దళారులు, డీలర్లు లాభాలు పొందుతున్నారు.అధికారులు తనిఖీలు చేయకపోవడం కారణంగానే రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లక్షల్లో జరుగుతున్న ఈ అక్రమ దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.