ఎన్.పి.ఆర్.డి మహిళా వికలాంగుల బతకమ్మ ఆట పాట కార్యక్రమం
ఎన్.పి.ఆర్.డి జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలిత
భువనగిరి 24 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మహిళా విభాగం ఆధ్వర్యంలో భువనగిరి సుందరయ్య భవన్ లో మహిళా వికలాంగుల బతకమ్మ ఆట పాట వికలాంగుల మహిళలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్.పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ జిల్లా మహిళ కన్వీనర్ కొత్త లలితా మాట్లా మాట్లాడుతూ...
వికలాంగుల మహిళలు పాల్గొనీ బతకమ్మ ను పెట్టి పాటలతో ఆటలతో ఉత్సాహంగా వేడుక జరిగింది. అన్ని సక్రమంగా ఉన్న మహిళలలు పండగ జరుపుకుంటంటే, వికలాంగుల మహిళలు వేదనకు గురి అవుతున్నారు.అందుకనే ప్రభుత్వాలు వికలాంగుల మహిళలను గుర్తించి వాళ్లకు అన్నిట్ల సౌకర్యం కల్పించే ప్రోత్సాహం చేస్తే బాగుంటదని వ్యక్తం చేశారు అందుకని ఎన్.పి ఆర్.డి మహిళా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు సుందయ్య భవన్ లో మహిళా వికలాంగులను ఏకం చేసి బతకమ్మ పండుగ ఉత్సావాలను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా వికలాంగులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండాపురం మనోహర ఎన్.పి.ఆర్.డి జిల్లా కోకన్వీనర్ బర్ల పార్వతి మహిళా జిల్లా నాయకురాలు సరిత జిల్లా మహిళా నాయకురాలు కల్లూరు నాగమణి మాయా రాణి సునీత గోపి తదితరులు పాల్గొన్నారు.