ఎన్నికల నియమావళి ప్రకారం తనిఖీలు పటిష్టంగా చేయాలి.
... రాహుల్ హెగ్డే ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట.
ఈరోజు సూర్యాపేట రూరల్ PS పరిది జాతీయ రహదారి 65పై జనగాం క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బందికి సలహాలు, సూచనలు చేసినారు, సామాన్య ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా నిబంధనల మేరకు వాహనాల తనికీలు పటిష్టంగా చేయాలని అక్రమ రవాణా ను నిరోధించాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామని, అంతరాష్ట్ర ఇంటిగ్రేటర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపినారు.
ఈ కార్యక్రమం నందు DSP రవి, CI సురేందర్ రెడ్డి, SI బాలు నాయక్, సిబ్బంది ఉన్నారు.