సావిత్రిబాయి పూలే జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
సముద్రాల వేణుగోపాల చారి కేంద్ర మాజీ మంత్రివర్యులు
తెలంగాణ రాష్ట్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్
హైదరాబాద్, 07 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- హైదరాబాద్ చిక్కడపల్లిలో త్యాగరాయ గాన సభలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి దైద వెంకన్న అనిత ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారి తెలంగాణ రాష్ట్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ప్రాతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నారు అనంతరం కేంద్ర మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా సంఘసంస్కర్తగా కవయిత్రిగా దేశానికి ఎనలేని సేవలు చేశారు మనమందరం ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ప్రాంతాన్ని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే నాటి కాలంలో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా తన భర్త అడుగుజాడల నడుస్తూ విద్య నేర్చుకుని బడుగు బలహీన వర్గాల బాలికల బాలికల కోసం విద్య నేర్పినారు కేవలం నాలుగు సంవత్సరాల లోనే అనేక పాఠశాలలు స్థాపించి అందాకారంలో ఉన్న బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపిన జ్ఞాన జ్యోతి అని ఆమె సేవలను కొనియాడారు ప్రముఖ సరస్వతి ఉపాసకులు దైవాజ్ఞ శర్మ తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు అను మండ్ల శోభారాణి సినిమా హీరో డాక్టర్ చింతకుంట మాణిక్ రావు గారు మాట్లాడుతూ సమాజంలో మహిళల ను గౌరవించుకోవాలి వారికి సముచిత స్థానం కల్పించాలి వారు అన్ని రంగాలలో రాణించాలన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు డాక్టర్ నాగేశ్వర శంకర గారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే రచయిత్రిగా కవయిత్రిగా గొప్ప సంఘసంస్కర్తగా కీర్తి ప్రతిష్టలు పొందినారు ఆమె బాలికల విద్య కోసం అనేక పాఠశాలలు స్థాపించి విద్యాబుద్ధులు నేర్పారు అని అన్నారు
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ శాంతాబాయి హంస ఫౌండేషన్ చైర్ పర్సన్ చెరుకు లక్ష్మి డి ఆర్ డి ఏ సూపర్డెంట్ నల్గొండ తిరుమల కుమారి రమేష్ కుమార్ అనిల్ కుమార్ బోడ సునీల్ నీరుడు విజయ్ పిడమర్తి ప్రవీణ్ పుట్టల మల్లేష్ ఇంటర్నేషనల్ మోడల్ కే సృజన వల్లూరి శ్రీనివాసరావు గుగ్గిళ్ల పేరయ్య దైద భద్రయ్య తిన్నారా మల్లయ్య పివిఎన్ అంజన్ కుమారి చేర్యాల వేణుగోపాలరావు మద్దికుంట్ల సైదులు సామాజిక సాహిత్య కళాభిమానులు పాల్గొన్నారు సుమారు 62 మందికి సావిత్రిబాయి పూలే ఎక్సలెన్స్ జాతీయ అవార్డు 2025ను ప్రధానం చేశారు.