ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య ఆరోగ్యసిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి కలెక్టర్

Jul 15, 2025 - 19:29
 0  17
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య ఆరోగ్యసిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి కలెక్టర్

జోగులాంబ గద్వాల 15 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఆదేశించారు. మంగళవారం ధరూర్  మండలంలోని ఉప్పేరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం-ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బంది హాజరు రిజిస్టర్, ప్రసవాల రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి రిజిస్టరులో సక్రమంగా పూర్తి వివరాలతో నమోదు చేయాలని సూచించారు. ఆసుపత్రికి ప్రతి రోజు రోగులు ఎంతమంది వస్తున్నారు, ఇన్ పేషంట్స్ వివరాలను వైద్య సిబ్బందితో అడిగి  తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, విధుల్లో సమయపాలన కచ్చితంగా పాటించాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించి, గర్భిణుల నార్మల్ ప్రసవాలు నిర్వహించి, ,ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించారు.ప్రతి గర్భిణి ప్రసవ తేదీకి అనుగుణంగా డెలివరీ క్యాలెండర్‌ను ఖచ్చితంగా రూపొందించి,అవసరమైన వైద్య సదుపాయాలు సమయానికి  అందించాలని అన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఈ ప్రాంతానికి  ఒక  ఆంబులెన్స్‌ను త్వరితగతిన కేటాయిస్తామన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.ఫార్మసిస్టు మందుల నిల్వలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ,ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు.టీకాలు ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం సమయానికి వేయాలని సూచించారు.ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం కోసం  ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది పూర్తి బాధ్యతతో పనిచేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి సిద్దప్ప, డాక్టర్లు రాజు,కృష్ణవేణి,వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
---

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333