అక్రమంగా మట్టి తరలింపు
జోగులాంబ గద్వాల 15 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి అధికారుల అనుమతి లేకుండా.. గుట్టు చప్పుడు కాకుండా తనగల గట్టు నుండి ఎర్రమట్టి తరలిస్తూ కాసులు దండుకుంటున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు,మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లువ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎర్రమట్టి తరలించాలంటే మైనింగ్ అనుమతులు తప్పనిసరి.కానీ మైనింగ్ శాఖ అధికారులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదు.ఇకనైనా ఉన్నతాధిధికారులు జోక్యం చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.