ఆర్థిక సహాయంఅందజేత  తాళ్ళ వెంకటేశ్వర్లు

May 1, 2025 - 18:56
May 1, 2025 - 20:26
 0  2
ఆర్థిక సహాయంఅందజేత   తాళ్ళ వెంకటేశ్వర్లు

తెలంగాణ వార్త,వేములపల్లి మే 1: రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారికి టి.వి.టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేతవేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన తక్కెళ్ళపెల్లి సురేష్ కూతురు బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గ్రామంలో రోడ్ దాటుతుండగా సూర్యాపేట నుండి మిర్యాలగూడకు వెళ్తున్న కారు డ్రైవర్ అతివేగం అజాగ్రత్తతో నడుపుతూచిన్నారిని ఢీ కొట్టింది స్థానికులు  గమనించి వెంటనే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం చిన్నారిని సూర్యాపేట ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారుసమాచారం మేరకు టి.వి.టి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ తాళ్ళ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి చిన్నారికి వైద్య చికిత్స నిమిత్తం 10,000 ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి భరోసా కల్పించారుఈ కార్యక్రమంలో  ఐఎన్టీయుసి రాష్ట్ర కార్యదర్శి బంటు చొక్కయ్య గౌడ్,తాజా మాజీ సర్పంచ్  వల్లంపట్ల ఝాన్సీ ప్రవీణ్, ఉప సర్పంచ్ కోల సైదులు, మెరుగు జానీ,మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు కోల సైదులు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెరుగు అనిల్ కుమార్, ఆవిరెండ్ల సతీష్, మెరుగు సురేష్, కనుకు సుందర్ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333