ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Sep 19, 2024 - 19:38
Sep 19, 2024 - 20:21
 0  4
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మకూరు... పేద ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛంద సంస్థలు నిర్వహించి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పూర్వ విద్యార్థుల సేవాసమితి ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కొప్పుల రంగారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలలో స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాలని విద్య వైద్య రంగాలలో గ్రామీణ ప్రాంతాల లో చైతన్యం తీసుకురావాలని అన్నారు ఉచిత కంటి శస్త్ర చికిత్సలను సద్విని యోగం చేసు కోవాలని అన్నారు. కాగా ఈ కంటి పరీక్షల శిబిరానికి 165 మంది హాజరుకాగా 84 మందికి శాస్త చికిత్సల కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సేవా సమితి ట్రస్ట్ బాధ్యులు ఎస్ కే సైదులు, బత్తుల దామోదర్ రెడ్డి, పోరండ్ల సత్తయ్య, బోళ్ల సోమిరెడ్డి, తంగెళ్ల వీరారెడ్డి, మహంకాళి కృష్ణమూర్తి, నగిరి పర్వతాలు, గొట్టిముక్కల గోపాల్ రెడ్డి ,శ్రీ శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.